స‌రిలేరుకు పెద్ద ఎదురు దెబ్బ‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెర‌కెక్కుతోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు హిందీలో డిజిట‌ల్‌, శాటిలైట్ రేట్లు టాప్ రేంజులో ఉన్నాయి. అయితే కొద్ది నెల‌ల క్రితం వ‌ర‌కు మీడియం రేంజ్ తెలుగు హీరోలు సైతం హిందీ మార్కెట్‌ను బేస్ చేసుకునే సినిమాలు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి వాళ్లు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ మార్కెట్ ఎందుకో సడెన్‌గా ప‌డిపోయింది. తెలుగు డ‌బ్బింగ్ సినిమాలు కొనే హిందీ నిర్మాత‌లు అంద‌రూ సిండికేట్ అవ్వ‌డ‌మే ఇందుకు కార‌ణం అంటున్నారు. చాణక్య లాంటి సినిమాలు బేరం కుదిరిన తరువాత కూడా సగంలో ఆగాయి.ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పెద్ద హీరోల‌కు కూడా ప‌డింది. మన సినిమాల్లో వుండే యాక్షన్ సీన్లు బాలీవుడ్ డిజిటల్ ఆడియన్స్ కు నచ్చడంతో మన సినిమాల డిజిటల్ రైట్స్ మంచి రేట్లు ఇచ్చి కొనేవారు.

అయితే ఇప్పుడు వాళ్లు సిండికేట్ అవ్వ‌డంతో ఈ సంక్రాంతికి వ‌చ్చే సినిమాల‌ను కూడా కొన‌ని ప‌రిస్థితి. చివ‌ర‌కు రిలీజ్ అయ్యాక మ‌ళ్లీ అప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అని స‌రిలేరు నీకెవ్వ‌రు టీం ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ + డిజిట‌ల్ శాటిలైట్ రైట్స్‌ను రు 15.5 కోట్ల‌కు అమ్మేశారు. మహర్షి సినిమా 20 కోట్లకు విక్రయిస్తే, సరిలేరు అయిదు కోట్లు తక్కువగా విక్రయించాల్సి వచ్చింది. అంటే మ‌హేష్ లాంటి సూప‌ర్ స్టార్ వ‌రుస హిట్ల‌తో ఉన్నా రు. 5 కోట్లు లాస్ అంటే ఎదురు దెబ్బే అనుకోవాలి.

Share.