సాహోతో అంచనాలను అందుకోని ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా జాన్ మీద దృష్టి పెట్టాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో భారీ అంచనాలతో వచ్చింది. అయితే సినిమా మేకింగ్ బాగున్నా కథ రొటీన్ అనిపించడంతో తెలుగు ప్రేక్షకులు సినిమాను తిప్పికొట్టారు. బాలీవుడ్ లో సాహో లాభాలు తీసుకురావడం విశేషం. ఇదిలాఉంటే ప్రభాస్ తర్వాత సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ వారే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కూడా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దె స్కూల్ టీచర్ గా నటిస్తుందట. పూజా ప్రేమ కోసం హీరో ప్రయత్నిస్తాడని తెలుస్తుంది.
పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా మొత్తం రోం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట. అయితే ఈ సినిమాలో ఓ యూనిక్ పాయింట్ ఉందని ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలో అది చూపించలేదని సాహో ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇక మరో పక్క సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా కూడా సినిమా మీద అంచనాలు పెంచేసింది. వరుస సినిమాలతో సక్సెస్ లతో పూజా హెగ్దె దుమ్ముదులిపేస్తుంది.