‘ సైరా ‘ ట్రైలర్… అరివీర భయంకర మెగాస్టార్….

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమాగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అలా వదిలారో లేదో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

ఇక ముందుగా ఈ రోజు ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చేయాల్సి ఉన్నా అది 22వ తేదీకి వాయిదా పడడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ కాకుండా ట్రైలర్ రిలీజ్ చేశారు. దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు పదుల వయసులో సైతం ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పెట్టి నటించాడు.

యాక్షన్ సన్నివేశాలు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తన విజన్ ని కేవలం మూడు నిమిషాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిరు యాక్షన్ ఎపిసోడ్స్ లో అరాచకమే ఇది అనే విధంగా రెచ్చిపోయారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ కట్స్తో నింపేశారు. ఇక సురేందర్రెడ్డి టేకింగ్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, చరణ్ నిర్మాణ విలవులు అదిరిపోతున్నాయని ట్రైలర్ చెప్పేసింది. ఇక సైరాతో చిరు క్రియేట్ చేసే రికార్డులకు ట్రైలరే నిదర్శనంగా ఉంది.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Share.