సహకరిస్తేనే అడుగుతారు..అందులో బలవంతం ఉండదు.. కాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రతి అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని కోరిక ఉంటుంది. అయితే వారికి ఆశించినట్టుగా అవకాశాలు రావాలి కదా.. తెలుగు తెర మీద హీరోయిన్ గా వెలగాలనే ఆశతో పరిశ్రమలోకి వచ్చానని చెబుతుంది భాను శ్రీ. అంతకుముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపించిన అమ్మడు బిగ్ బాస్ సీజన్ 1లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ షో తర్వాత భానుకి పాపులారిటీ పెరిగింది.

బిగ్ బాస్ తర్వాత సినిమాల కన్నా బుల్లితెర షోల్లో బాగా కనిపిస్తుంది భాను శ్రీ. మాటివి, ఈటివి షోలకు ఆమెను తీసుకున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఏడు చేపల కథ సినిమాలో భాను శ్రీ నటించింది. ఆమెని అభిమానించే బుల్లితెర ప్రేక్షకులు సైతం చీ చీ భాను ఏంటి ఇలాంటి సినిమాలో నటించిందని అనుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు తనకు స్టోరీ ఒకటి చెప్పి సినిమా మరొలా తీశారని అన్నది. అంతేకాదు అంత బూతు సినిమాలో కూడా తానెక్కడ స్కిన్ షో చేయలేదని అన్నది.

ఇక కాస్టింగ్ కౌచ్ పై కూడా భాను తన వర్షన్ చెప్పింది. సహకరిస్తేనే అడుగుతారని.. అందులో ఎవరి బలవంతం ఉండదని అన్నది భాను శ్రీ. అయితే నిజంగానే వీళ్లు మూమెంట్ ఇస్తేనే లైంగికంగా వేధిస్తారు. ఆ ఛాన్స్ అసలు ఇవ్వకపోతే మాత్రం ఎవరు ముట్టుకోరని అంటుంది. భాను శ్రీ చేసిన కామెంట్స్ కు మిగతా వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share.