సరిలేరు నీకెవ్వరు రన్ టైం లాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర సం యుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈమధ్య సినిమాలో కంటెంట్ బాగుంటే 3 గంటల సినిమా అయినా చూసేస్తున్నారు.

రంగస్థలం సినిమా దానికి ఉదహరణగా చెప్పుకోవచ్చు. మహేష్ భరత్ అనే నేను, మహర్షి సినిమాలు కూడా రన్ టైం దాదాపు 3 గంటలకు దగ్గరా వచ్చాయి. ఇక లేటెస్ట్ గా రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా రన్ టైం 3 గంటల దాకా ఉంటుందని తెలుస్తుంది. అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది.

ఫైనల్ గా ఈ సినిమాను 3 గంటలకు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కథ మీద నడిపించిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కామెడీ మీద దృష్టి పెట్టాడట. సినిమాలో కామెడీ అదిరిపోతుందని ముందునుండి చెబుతున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ కు హ్యాట్రిక్ హిట్ అందిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Share.