సరిలేరు నీకెవ్వరుపై నెగటివ్ రూమర్స్.. కావాలని చేస్తున్నారా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ సినిమా వస్తుంది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది. కేవలం ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే కాదు మహేష్ సినిమాలకు కామన్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ గా తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మహేష్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. బ్రహ్మోత్సవం తర్వాత మళ్లీ సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన మహేష్ కు భరత్ అనే నేనుతో సక్సెస్ అందింది.

ఆ తర్వాత మహర్షితో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు సంబందించి ఈమధ్య నెగటివ్ రూమర్స్ బాగా ఎక్కువయ్యాయి. సంక్రాంతి పోటీగా వస్తున్న ఈ సినిమాపై ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సినిమా అనుకున్నంత విధంగా రాలేదని.. పోటీలో నిలబడటం కష్టమేనని ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు మహేష్ దాకా వెళ్లడంతో ఇక సినిమా ప్రమోషన్స్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే సంక్రాంతికి పోటీగా వస్తున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. అందుకే మహేష్ సినిమా టీజర్ తో ప్రమోషన్స్ మొదలు పెడతారట. నెగటివ్ ట్రోల్స్ ఎంత చేసినా బాక్సాఫీస్ పై మొనగాడిగా నిలబడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Share.