సమంతకు అడ్డుగా మారిన ఆ ముగ్గురు హీరోలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ టైటిల్ చూసి సమంతకు అక్కినేని హీరోలైన నాగ చైతన్య, నాగార్జున, అఖిల్ లే ఆమెకు అడ్డుగా మారారని అనుకోవచ్చు. అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే లెక్క. ప్రస్తుతం అక్కినేని ఇమేజ్ ను కోడలిగా పర్ఫెక్ట్ గా కోసాగిస్తుంది సమంత. అంతేకాదు చైతుతో కలిసి మజిలీతో హిట్ అందుకున్న సమంత ఓ బేబీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు రీమేక్ ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అసలైతే ఈ సినిమాను నవంబర్ కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నారు. నవంబర్ మిస్సైనా సరే డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని అనుకోగా ఇప్పుడు ఆ సినిమాకు ఓ ముగ్గురు హీరోలు అడ్డుగా మారారు. ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు అంటే ఒకరు నందమూరి బాలకృష్ణ, మరొకరు సాయి తేజ్, మూడో వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ.

సమంత నటిస్తున్న సినిమాకు అడ్డుగా వీరి సినిమాలు వస్తున్నాయి. బాలయ్య రూలర్, సాయి తేజ్ ప్రతిరోజు పండుగే, రవితేజ డిస్కో రాజా సినిమాలు డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ మూడింటిలో ఒకటి మాత్రం డిసెంబర్ రెండో వారం వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు సినిమాల వల్ల శర్వానంద్ సమంత నటిస్తున్న 96 రీమేక్ జాను సినిమా రిలీజ్ లేట్ అవుతుందట. మరి ఈ మూవీకి రిలీజ్ మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Share.