పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటేనే ప్రపంచంలో అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్స్‌కు సైతం దడ పుట్టిస్తుంది. షోయబ్ అక్తర్ సంధించే యార్కర్లు… షార్ట్ పిచ్ బాల్స్ ఎదుర్కోవటం మామూలు ఆటగాడి వల్ల కాదు. మైదానంలో అక్తర్ 150 కిలోమీటర్ల వేగంతో విసిరే భయంకరమైన బంతులను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్స్‌కు పెద్ద సవాల్ లాంటిది.
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక షోయిబ్ అక్తర్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు క్రికెట్ మ్యాచ్‌లపై విశ్లేషణలు ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే షోయబ్ అక్తర్‌ను ఓ బాలీవుడ్ హీరోయిన్ మీద ఎనలేని ప్రేమ ఉండేదట. ఈ విషయాన్ని తన తాజా షోలో వెల్లడించారు. తాను బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రేను ఎంతగానో ఇష్టపడేవాడినని…ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్ అనే బాలీవుడ్ చిత్రంతో ఆమెపై మరింత ప్రేమను పెంచుకున్నట్లు చెప్పారు. ఆ సినిమా తర్వాత నుంచి ఆమె ఫోటోను పర్సులో పెట్టుకొని తిరిగేవాడినని వ్యాఖ్యానించారు.
తాను తన ప్రేమను ఆమెతో వ్యక్తపరచాలని అనుకున్నానని.. ఒక వేళ ఆమె తన ప్రేమ ఒప్పుకోకపోతే తాను సోనాలీని కిడ్నాప్ చేయాలని కూడా అనుకున్నట్టు కూడా షోయబ్ చెప్పాడు. సోనాలి అంటే తనకు ఎంతో పిచ్చి అన్న షోయబ్ తన జాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఇలా సోనాలిపై షోయబ్ ప్రేమ ఇలా వన్ సైడ్ ప్రేమగానే మిగిలిపోయింది. ప్రస్తుతం సోనాలి హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే.