వెండితెర‌పై హిట్‌.. బుల్లితెర‌పై ఫ‌ట్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన‌ మహర్షి ఈ ఏడాది వేసవిలో బాక్సాఫీస్ వద్ద స‌త్తా చాటింది. క‌మ‌ర్షియ‌ల్‌గా మ‌రీ లాభాలు రాక‌పోయినా బ్రేక్ఈవెన్ దాటేసింది. ముగ్గురు అగ్ర నిర్మాతు చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు – పీవీపీ సంయుక్తంగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ మ‌రో హీరో. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది.

మంచి సామాజిక సందేశంతో తెర‌కెక్కిన ఈ సినిమా తాజాగా బుల్లితెర‌పై ప్ర‌సారం కాగా పేల‌వ‌మైన టీఆర్పీలు వ‌చ్చాయి. దీనికి కేవ‌లం అమోజాన్ ప్రైమ్ అని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది థియేట‌ర్లో మ‌హ‌ర్షిని చూసేయ‌డం.. ఇక అమోజాన్ ప్రైమ్ వీడియోస్‌లో కూడా ఎక్కువ మంది ప‌దే ప‌దే మ‌హర్షిని చూడ‌డంతో బుల్లితెరపై మహ‌ర్షికి కేవ‌లం 9.2 టీఆర్పీ మాత్ర‌మే వ‌చ్చింది.

ట్విస్ట్ ఏంటంటే ఇటీవ‌లే బుల్లితెర‌పై ప్ర‌సారం అయిన అక్కినేని కోడ‌లు ఓ బేబీ కూడా 9 టీఆర్పీ సాధించింది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 ఈ యేడాది 17.2 టీఆర్పితో మొదటి స్థానంలో ఉంది. ఏదేమైనా బుల్లితెర‌పై సినిమాల‌కు టీఆర్పీలు ప‌డిపోవ‌డానికి అమోజాన్, నెట్‌ఫ్లిక్స్ ప్ర‌ధాన కార‌ణం.

Share.