విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగచైతన్య జంటగా కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వెంకీ మామ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వాస్తవంగా మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక టాక్‌తో సంబంధం లేకపోయినా క్రేజ్ నేపథ్యంలో వెంకీ మామ మూడు రోజులకు వరల్డ్ వైడ్‌గా రు 20.93 కోట్ల షేర్ రాబట్టింది.
ఇక తొలి రోజే రు.7.8 కోట్ల షేర్ రాబట్టి, వెంకి.. చైతు కెరీర్‌లో రికార్డుగా నిలిచిన ఈ సినిమా మూడు రోజులకు రు.20.93 కోట్ల షేర్ రాబట్టడం అంటే సురేష్ బాబు పక్కా ప్లానింగే అని చెప్పాలి. వెంకీ మామకు వరల్డ్ వైడ్‌గా రు.36 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఆ టార్గెట్‌ను ఫస్ట్ వీక్‌లో ఎంత వరకు చేధిస్తుందో ? చూడాలి.
వచ్చే శుక్రవారం బాలయ్య రూలర్, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే సినిమాలు ఉన్నాయి. ఇక వెంకీ మామ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 6.72 కోట్లు
సీడెడ్ – 2.7 కోట్లు
వైజాగ్ – 2.2 కోట్లు
ఈస్ట్ – 1.42 కోట్లు
వెస్ట్ – 0.81 కోట్లు
గుంటూరు – 1.44 కోట్లు
కృష్ణా – 1.04 కోట్లు
నెల్లూరు – 0.63 Cr
————————————-
ఏపీ + తెలంగాణ = 16.98 కోట్లు
————————————-
రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 2.45 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ = 20.93 కోట్లు