వీర భోగ వసంత రాయులు… నాకు సంబంధం లేదంటున్న శ్రీ విష్ణు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఆదరణ పెరిగిపోవడంతో యంగ్ హీరోలు మొదలుకొని సీనియర్ స్టార్ హీరోల వరకు మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నారు. అయితే ఈ ట్రాక్‌లో అందరూ హిట్‌లు కొట్టలేకపోతున్నారు. కొందరు మాత్రమే హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే.. మరికొందరు తమ ఫ్లాప్ సినిమాతోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ నటించిన ‘వీర భోగ వసంత రాయులు’ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాకు మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా వెనుకబడింది. దీంతో ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు లైన్ కట్టాయి. ఈ రివ్యూలు చూసిన చిత్ర దర్శకుడడు రివ్యూలు రాసే వారిని బూతులు తిడుతూ తన సినిమా ప్రమోట్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అటు చిత్ర దర్శకుడి తీరుపై రివ్యూలు రాసేవారితోపాటు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ తతంగం అంతా చూసిన హీరో శ్రీవిష్ణు తాజాగా ఈ వివాదంపై తన క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా పోస్టర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. చిత్ర దర్శకుడు, ప్రొడక్షన్ టీమ్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పోస్టర్లను రిలీజ్ చేశారని ఆయన చెప్పుకొచ్చాడు. తాను రివ్యూవర్లను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని శ్రీవిష్ణు చెప్పాడు. మరి ఈ వివాదంపై మిగతా చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయినా.. సినిమా బాగుంటే బాగుందని రాసి, బాగాలేకపోతే బాలేదని రాసే రివ్యూవర్లపై చిత్ర దర్శకుడు ఇంత దురుసుగా వ్యవహరించడం సరికాదని చిత్ర విశ్లేషకులు అంటున్నారు.

Share.