1945 ఇది ఓ సంవత్సరం కదా.. దీనిపై వివాదం ఏమిటి అనుకుంటున్నారా..? అవును ఓ ఏడాది. కాకుంటే ఇదే టైటిల్తో ఓ సినిమా రాబోతుంది. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు. ఆయన నటించిన ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది.. అయ్యో ఇలాంటి సినిమా ఒకటి ఉందా.. దీనిలో తెలుగు హీరో నటించాడా..? దీనికి వివాదాలు వచ్చాయా.. ? ఇంతకు ఈ సినిమాలో ఎవరు హీరో.. ఏమిటా వివాదాలు..?
1945 సినిమాలో టాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి నటించిన చిత్రం. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు లేండీ. ఇప్పుడు వచ్చిన సమస్య కూడా విడుదల తేదీని ప్రకటించడంతోనే వచ్చింది. చివరికి హీరో రానా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్దమవుతున్నాడు. స్వయంగా హీరో రానా ప్రకటించాడు. ఇంతకు 1945 సినిమాపై వచ్చిన సమస్యలు ఏమిటో చూద్దాం. ఈ సినిమాలో రానా, నాజర్, సత్యరాజ్ నటిస్తున్నారు.
ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. అయితే సినిమాను జనవరి 24న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత రాజరాజన్ ప్రకటించారు. దీనిపై రానా గుస్సా అయ్యారు. నాకు సినిమా కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాలేదని, నాకు పారితోషికం, ఇతర విషయాల్లో తేడా వచ్చిందని, జనాల్ని మోసం చేయడానికి, డబ్బులు రాబట్టుకోవడానికి నిర్మాత పోస్టర్ విడుదల చేసారని, ఎవ్వరు మోసపోవద్దని రానా వాదన.
అయితే నిర్మాత మాత్రం రానా సినిమాలో తన పార్ట్ను పూర్తి చేశారు. కేవలం తమిళ వెర్షన్ డబ్బింగ్ పూర్తి చేసి, తెలుగు డబ్బింగ్ రానా చెప్పలేదని నిర్మాత వాదన. ఇద్దరి వాదనలు ఇలా ఉంటే దర్శకుడు సత్య శివ కూడా దాదాపుగా నిర్మాత వాదననే ఏకీభవించారు. సినిమా పూర్తి అయింది వాస్తవం, ఇద్దరి మద్య ఏమైనా లావాదేవిలు ఉంటే వాటిని పరిష్కరించుకుని సినిమా విడుదలు సహాకరించాలని దర్శకుడు కోరుతున్నాడు. రానా మాత్రం వెనక్కి తగ్గేది లేదు.. అవసరమైతే కోర్టుకు పోతానంటూ నిర్మాతను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు 1945 సినిమా విడుదలపై ప్రతిష్టంభన నెలకొంది.