కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ తాజా చిత్రం బిగిల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయ్యింది. విజయ్ – అట్లీ అంటేనే బ్లాక్బస్టర్ కాంబో. పోలీసోడు, అదిరింది తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఈ మూడో సినిమాతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. నయనతార హీరోయిన్‌గా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమా విజయ్ కెరీర్లోనే ఎన్నడూ లేనంతంగా ఓపెనింగ్స్ సాధించింది.
ఇక ఈ సినిమాను తెలుగులో ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై పీఆర్వో కోనేరు మహేష్ రిలీజ్ చేశారు. రు.10 కోట్లకు ఈ సినిమా తెలుగు రైట్స్ కొన్నారు. ఇప్పటికే ఐదు రోజులకు దాదాపు 80% రికవరీ చేసింది. అయితే ఐదో రోజు కార్తీ ఖైదీ పుంజుకోగా విజిల్స్ వసూళ్లు మాత్రం డ్రాప్ అయ్యాయి. ఇక ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి విజిల్ బ్రేక్ఈవెన్‌కు వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోన్న విజయ్‌కు ఇది మంచి హిట్ సినిమాగా నిలిచింది.
ఏరియాల వారీగా ‘విజిల్’ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 2.66 కోట్లు
సీడెడ్ – 2.36 కోట్లు
గుంటూరు – 85.2 లక్షలు
ఉత్తరాంధ్ర – 83.3 లక్షలు
తూర్పు గోదావరి – 56.1 లక్షలు
పశ్చిమ గోదావరి – 38.7లక్షలు
కృష్ణా – 54.3 లక్షలు
నెల్లూరు – 35.8 లక్షలు
——————————————
ఏపీ + తెలంగాణ షేర్ = 8.55 కోట్లు
——————————————