నువ్వు నేను సినిమా హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ఫోటో షూట్స్ తో మళ్లీ ప్రేక్షకులను పలుకరించింది. జీ అవార్డ్స్ లో తళుక్కుమన్న అనిత తన ఫోటో షూట్స్ చేసింది ఇంటి వాచ్ మెన్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అవార్డ్ ఫంక్షన్ ఏదైనా వస్తే హీరోయిన్స్ తాము రెడీ అయిన కాస్టూం మీద ఫోటో షూట్ చేయడం కామన్. అయితే దీనికోసం అందరు ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ ను వాడుతారు.
కాని అనిత మాత్రం తన వాచ్ మెన్ తోనే ఫోటో షూట్ చేయిస్తుందట. అతనిలో మంచి క్రియేటివ్ ఫోటో గ్రాఫర్ దాగి ఉన్నాడని తెలుసుకున్న అనిత అతనితోనే తన ఫోటో షూట్స్ చేయిస్తుందట. ఒకటి రెండు క్లిక్ అయితే వాచ్ మెన్ ఉద్యోగం మానిపించేసి ఫోటోగ్రాఫర్ గా అతనికి కెరియర్ ఇవ్వాలని చూస్తుంది. వాచ్ మెన్ లోని హిడెన్ టాలెంట్ ను గుర్తించి అనిత చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.
తెలుగు సినిమాల్లో అలరించిన అనిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి పిల్లలు అంటూ జీవితం హ్యాపీగా సాగుతున్న అమ్మడు సరైన అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అన్నట్టు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా కష్టం కాబట్టి సిస్టర్ రోల్స్ చేయాల్సి ఉంటుంది.