రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘ భీష్మ ‘ ఫస్ట్ గ్లింప్స్…

Google+ Pinterest LinkedIn Tumblr +

నితిన్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇక తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా….చిత్రబృందం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

ఇందులో నితిన్-రష్మిక వెంట నడిచే సీన్ ఆకట్టుకుంటుంది. నా లవ్ విజయ్ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’.. అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ బాగుంది. అలాగే రష్మిక నడుము చూస్తూ ఆమెని ఫాలో అవడం, ఆమె తన వైపు తిరగ్గా నడుమును పట్టుకోబోతూ.. చింపేశారు అన్నట్టు నితిన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి.

మొత్తం 31 సెకన్ల సమయం గల ఈ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. దీని బట్టి చూస్తుంటే భీష్మలో రొమాన్స్, లవ్, కామెడీ అన్ని సమపాళ్ళలో ఉండేలా కనిపిస్తున్నాయి. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

అలాగే నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ పని చేస్తున్నారు. మరి చూడాలి ఇటీవల కాలంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు భీష్మ సినిమా హిట్ ఇస్తుందేమో.

Share.