రేప్ సీన్ల సినిమాలు ఆ హీరోయిన్లు వ‌ద్దంటున్నారా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

దిశ అత్యాచారం హత్య ఘటన తర్వాత సిని పరిశ్రమ మీద కూడా అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల్లో ఉండే అభ్యంతరకర సీన్లు యువతను పెడ దోవ పట్టిస్తున్నాయని… వాటి కారణంగా రేప్ ఘటనలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. కథలో పట్టు కొన్ని సీన్లు దర్శకులు పెడుతున్నారు. వాటిల్లో వివాదాస్పద సీన్లు కూడా కొన్ని ఉంటున్నాయి. వాటిని చూసి కొంత మంది యువత ఆ విధంగా బయట చేస్తే మనను పట్టుకోలేరు అనే భావనలో ఉన్నారు…

ఇటీవల దిశ అత్యాచార ఘటన కూడా అదే తరహాలో ఉందని, చిత్తూరు జిల్లాలో యువకులు ఒక బాలికను రేప్ చేసిన ఘటన కూడా అలాగే ఉందనే ఆరోపణలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో ఇప్పుడు హీరోయిన్లు అలాంటి సినిమాలు అంటే వద్దని అంటున్నట్టు సమాచారం. చెల్లినో ఫ్రెండ్ నో రేప్ చేసే ఘటనలు ఉంటే తమకు అలాంటి పాత్రలు అవసరం లేదని… ఇక వాటి కోసం కొన్ని సీన్లలో స్కిన్ షో కూడా చేయలేమని చెప్తున్నట్టు తెలుస్తుంది. తమిళంలో ఇప్పటికే హీరోయిన్లు అందరూ కూడా ఇదే మాట ఉన్నట్టు సమాచారం.

టాలివుడ్ లో కూడా కొందరు హీరోయిన్లు నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. రేప్ సీన్లు ఉన్న పాత్రలు సినిమాల్లో వద్దని ఒకవేళ ఉన్నా సరే ఆ సీన్లకు లింకులు ఉన్న పాత్రలు తమకు ఇవ్వొద్దని కోరుతున్నారట. అటు దర్శక నిర్మాతలు కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఆ విధమైన పాత్రలు ఉంటే క్లాస్ ఆడియన్స్ ఇక చూసే అవకాశం లేదని, అలాంటి సన్నివేశాలు కూడా కథలో వద్దని రచయితలను కోరినట్టు కూడా ఫిలిం నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

Share.