రేప్‌కు అమ్మాయిలు కోప‌రేట్ చేయండి.. డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై పలువురు ప్రముఖులు ఎవరికి వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దిశ అత్యాచారం తర్వాత నాలుగైదు సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. చివరకు హ‌త్యాచార విషయం పార్లమెంటును కుదిపేసింది. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా పలువురు ఎంపీలు దిశ అత్యాచార ఉదంతాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ హ‌త్యాచార‌, అత్యాచారాల‌పై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ హ‌త్యాచారాల‌పై పలువురు సినీ ప్రముఖులు సైతం ఘాటుగా స్పందించారు. అయితే తాజాగా ఓ దర్శకుడు మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్లు చేసి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు అత్యాచారం చేసే వాళ్ల‌కు కోప‌రేట్ చేయాల‌ట‌. దిశా అత్యాచారం ఘటనపై స్పందిస్తూ అతను ఈ విధంగా సంచలన కామెంట్స్ చేశాడు. దాంతో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు ఎందరో నెటిజన్లు అతన్ని ఏకిపారేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే నరికిపారేస్తామని బెదిరిస్తున్నారు.

ఆడ‌వాళ్ల‌ను రేప్ చేసేట‌ప్పుడు వాళ్లు స‌హ‌క‌రించాల‌ని.. లేక‌పోతే వాళ్లు పోలీసుల‌కు ఎక్క‌డ చెప్తారో ? ఎవ‌రికి చెప్పేస్తారో ? అన్న భ‌యంతోనే మ‌గాళ్లు వాళ్ల‌ను చంపేస్తారంటూ చాలా దారుణంగా మాట్లాడాడు. ప్ర‌భుత్వం రేపిస్టుపై ఈ చ‌ట్టాల‌ను బ‌ల‌వంతంగా రుద్దక‌పోతే వాళ్లు కూడా ఆడ‌వాళ్ల‌ను హ‌త్య‌లు చేయ‌ర‌ని చెప్పుకొచ్చాడు. ఇక రేప్‌ల‌ను లీగ‌లైజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని… వందకి నా బొందకి ఫోన్లు చేసేకంటే పర్సులో కండోమ్స్ పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ప్రాణాలు దక్కుతాయి. కండోమ్‌లతోనే మహిళలకు రక్షణ ఉంటుంద‌ని చెప్పాడు.

అక్క‌డితో ఆగ‌ని డేనియ‌ల్ రేప్ అనేది రేపిస్టుల‌కు సంతృప్తి ఇస్తుంది.. దీని వ‌ల్లే ఆడాళ్లు బ‌తుకుతారు.. త‌ప్పు మాట్లాడి ఉంటే క్ష‌మించండి.. దిశా ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని చెప్పాడు. డేనియ‌ల్ కామెంట్ల‌పై ఎవ‌రికి వారు స్పందిస్తున్నారు. చాలా మంది డేనియ‌ల్ కామెంట్ల‌ను త‌ప్పుప‌డుతున్నారు.

Share.