‘ రూల‌ర్‌ ‘ కు ఆ ఒక్క‌టే క్రేజ్ తెచ్చిందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న తాజా చిత్రం రూల‌ర్‌. ఈ యేడాది ఆరంభంలో చేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమాలు సూప‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో రూల‌ర్‌పై బాల‌య్య మంచి కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే స్టిల్స్‌, టీజ‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసిన రూల‌ర్ తాజాగా ట్రైల‌ర్‌తో మరింత‌గా దూసుకుపోతోంది. ట్రైల‌ర్లో బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌, ఫైట్లు, పంచ్ డైలాగులు బాగా ద‌ట్టించారు. ఇక సెంటిమెంట్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక హీరోయిన్లు ఇద్ద‌రూ గ్లామ‌ర‌సం బాగానే వ‌ల‌క బోసిన‌ట్టు ఉంది.

సోనాల్ బికినీ ట్రీట్ కూడా ఉంది. ఇక బాల‌య్య ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఎక్కినా… మిగిలిన వ‌ర్గాల‌ను కూడా థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే ఒక్క సెంటిమెంట్ మాత్ర‌మే ఉంది. బాల‌య్య సినిమాల్లో సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్టే అవుతుంది.

సింహా, లెజెండ్‌, జై సింహా సినిమాలు అలాగే హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు రూల‌ర్‌లో సైతం సెంటిమెంట్ ఉన్న‌ట్టు ట్రైల‌ర్ చెప్ప‌డంతో మిగిలిన వ‌ర్గాల్లో, క్లాస్ ఫ్యాన్స్‌లో సినిమాకు ఇదే క్రేజ్ తెచ్చిపెట్టింది.

Share.