రూమర్లపై రుసరుసలాడుతున్న రష్మిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఇప్పుడు సూపర్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. వరుసగా స్టార్ అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు నిర్మాతలు డేట్స్ అడిగినా సరే ఖాళీ లేవని చెబుతుందట. ఎవరికో కాదు టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజుకే రష్మిక షాక్ ఇచ్చిందని టాక్. అయితే మరోపక్క రష్మిక రెమ్యునరేషన్ బాగా పెంచేసిందన్న వార్తలు కూడా వచ్చాయి.

అయితే అటు ఇటు తిరిగి ఈ న్యూస్ రష్మిక దాకా వెళ్లాయట. కావలని ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని. అయినా ఒక హీరోయిన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో నిర్మాతలకు తెలియదా అంటుంది రష్మిక. ఓ హీరోయిన్ కు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటే ఆమెకు డిమాండ్ ఉందన్నట్టే. పరిశ్రమలో డిమాండ్ అండ్ సప్లై పాలసీ ద్వారానే రెమ్యునరేషన్ ఉంటుందని. తాము అడిగినంత మాత్రాన నిర్మాతలు ఇవ్వరని చెబుతుంది రష్మిక.

తెలుగులో నటించిన 3 సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. ఇదే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మూవీలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. తనకు డేట్స్ అడ్జెస్ట్ కాకనో.. లేక స్టోరీ నచ్చకనో సినిమాలు మిస్ అవుతున్నా తప్ప రెమ్యునరేషన్ గురించి కాదని గట్టిగా చెబుతుంది రష్మిక. మొత్తానికి అమ్మడు బాగానే క్లారిటీతో ఉందని మాత్రం చెప్పొచ్చు.

Share.