రెండు దశాబ్దాల క్రితం తన భారీ అందాలతో కుర్ర కారుకు కిర్రాక్ పుట్టించిన రాశీ బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమైంది. నిండు అయిన తెలుగు దనం ఉట్టి పడే రాశీ అప్పట్లో క్యూట్ లుక్స్‌తో యూత్ మనస్సులను దోచేసింది. అస్టిసెంట్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుని ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న రాశీ ఇటీవల బుల్లితెర మీద బాగా హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు మాట్లాడారు.
ఆమెకు ఒకనాక టైంలో సీనియర్ హీరోయిన్ వెంకటేష్‌ను పెళ్లాడాలన్న కోరిక బలంగా ఉండేదట. వెంకటేష్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ రాశీకి ఆరేళ్ల వయసులో వెంకటేశ్ సినిమాల హవా నడిచేదట. ఆ టైంలో ఆ సినిమాల ప్రివ్యూ షోలకు రాశీ కుటుంబానికి ప్రీ పాసులు వచ్చేవట. అలా వెంకటేష్ సినిమాలు ఎక్కువుగా చూసిన రాశీ తాను వెంకటేష్‌ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.
ఇంకాస్త పెద్దదయ్యాక మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ మీద ఇష్టంతో ఆయన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. మొత్తం 75 సినిమాల్లో నటించిన రాశీ బాలకృష్ణతో బాలనటిగా బాలగోపాలుడు సినిమా చేసి… తర్వాత అదే బాలయ్యతో హీరోయిన్‌గా కృష్ణబాబు సినిమాలో నటించింది. ఏదేమైనా రాశీ వెంకీని పెళ్లి చేసుకోవాలన్న విషయం మొత్తానికి ఇన్నాళ్లకు బయట పడింది.