రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. ఈసినిమా ఫస్ట్‌లుక్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ్ హీరోగా నటిస్తున్న 18వ చిత్రంగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు దర్శకత్వం కిషోర్ తిరుమల వహిస్తుండగా, స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాకు క్రిష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ లో తెరకెక్కుతుంది.
రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత వస్తున్న ఈ చిత్రం తమిళ చిత్రం తడమ్‌కు రీమేక్‌గా చేయబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగులో రెడ్ టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ కు కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో హీరో రామ్ మాసిన గుబురు గడ్డంతో, బెదురు కండ్లతో, టీషర్ట్‌లో సైడ్‌కు తిరిగి చూస్తున్న ఫోటోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
అయితే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన ఇస్టార్ శంకర్ హిట్ నేపథ్యంతో వస్తున్న చిత్రం రెడ్. ఈ సినిమాపై భారీ నమ్మకాన్నేపెట్టుకున్నాడు రామ్. తమిళంలో తడమ్ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. దీన్ని రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం మణిశర్మ. ఈ సినిమా రామ్ కేరీర్ ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.