రామ్ చరణ్‌కు అల్లు అరవింద్‌కి చెడిందా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక నిర్మాణం విషయంలో కూడా ఎక్కడా నిర్మాతలు రాజీ పడటం లేదు. రాజమౌళి సినిమా కావడంతో ఖర్చు విషయంలో ఎంత అయినా పర్వాలేదనే భావనలో నిర్మాత దానయ్య ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మెగా ఫ్యామిలీ లో చిచ్చు పెట్టిందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సినిమా రాజమౌళి తో చేయడం అల్లు అరవింద్ కి ఎంత మాత్రం ఇష్టం లేదని అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. మగధీర సినిమా సమయంలో అల్లు అరవింద్ కి రాజమౌళికి విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి వారి మధ్య మాటలు కూడా లేవు. ఇదే విషయాన్ని జక్కన్న ఒక ఇంటర్వ్యులో కూడా స్పష్టంగా చెప్పారు. సినిమా రిలీజ్‌, ప్ర‌మోష‌న్ల విష‌యంలో తాను చెప్పిన‌ట్టు చేయ‌లేద‌న్న‌దే రాజ‌మౌళి ఆరోప‌ణ‌.

ఇప్పుడు ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనీసం ఇతర సినిమాల మీద కూడా దృష్టి పెట్టకపోవడం, తాను ఒక సినిమా కథ పంపిస్తే… ఆర్ ఆర్ ఆర్ అయ్యాక చూద్దామని చెప్పడం వంటివి అల్లు అరవింద్ కి ఆగ్రహం తెప్పించాయట. ఇటీవల ఒక కార్యక్రమంలో ఇద్దరు ఎదురు పడినా కనీసం మొహాలు కూడా చూసుకోలేదని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు వినపడుతున్నాయి.

తన మాటను కనీసం రామ్ చరణ్ లెక్క చేయలేదని అటు చిరంజీవి కూడా తన మాటను గౌరవిన్చాలేదనే భావనలో అల్లు అరవింద్ ఉన్నారట. ఈ విషయంలో కొందరు రాజీ చేయడానికి ప్రయత్నాలు చేసినా సరే అల్లు అరవింద్ వినలేదని భవిష్యత్తులో చెర్రీ తో సినిమాలు చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తానని చెప్పాడట.

Share.