బాలీవుడ్ అందాల భామ వాణి కపూర్ చేసిన పనికి నెటిజెన్లు ఆమె మీద అగ్గిమీదగుగ్గీలవుతున్నారు. అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ లో ఓ జాకెట్ వేసుకుని దర్శన మిచ్చింది. క్లీవేజ్ షోతో స్పైసీ లుక్ తో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఆ జాకెట్ పై రాముడు పేరు ఉండటం నెటిజెన్లు గమనించారు. అంతే ఒక్కదెబ్బతో ఆమె మీద విమర్శలు వెళ్లువెత్తాయి.
రాముడి పేరు పెట్టుకుని ఆ జాకెట్ ధరించడంలో ఆమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందో అని వాణి కపూర్ మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు. అయితే నెటిజెన్ల తాకిడికి అమ్మడు ఆ ఫోటో డిలీట్ చేసినా అప్పటికే అది వైరల్ గా మారింది. ఫోటో లు ఆల్రెడీ డౌన్ లోడ్ చేసుకున్న వారు ఆమెకి తిరిగి ఆ ఫోటోలు సెండ్ చేస్తూ తిట్ల దండకం ఎత్తుకున్నారు.
వాణి కపూర్ మాత్రం ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయింది. పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టిన ఈ భామలు తము ఒకటి ఆలోచించి చేస్తే రిజల్ట్ మరోలా వస్తుంది. వాణి కపూర్ లేటెస్ట్ హాట్ పిక్ ఆమె ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉన్నా నెటిజెన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు.