రానాతో ప్రేమా పై స్పందించిన రకుల్..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలివుడ్ లో హిట్ లు లేక బాలివుడ్ మీద పడిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ భారీ ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో ప్రముఖ హీరోలతో సినిమాలు చేసినా కొన్ని మాత్రమే ఆమెకు హిట్ లు ఇవ్వగా ఆమె నటనకు పెద్దగా మార్కులు పడలేదు. దీనితో ఈ భామ హింది మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. తమిళంలో కూడా తనకు అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో హింది దర్శకులతో స్నేహం చేస్తుంది ఈ భామ. తెలుగులో అలరించింది కొన్నాళ్ళే అయినా ఈ భామపై రూమర్లు ఎక్కువగానే వచ్చాయి.

ఇందులో భాగంగానే టాలివుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటితో ఈమెకు ప్రేమాయణం నడుస్తుందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే వీరి పెళ్లి కూడా అవుతుందని ప్రచారం చేసారు. అందుకు పెద్దలు అంగీకరించారని ప్రచారం చేయడం కొసమెరుపు. ఈ నేపధ్యంలో రకుల్ ఈ వార్తలపై స్పందించింది. స్పందించింది. ప్రస్తుతం మార్జావాన్ సినిమా ప్రమోషన్ లో ఉన్న ఈ భామ రానాతో తనకు ఉన్న సంబంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు దక్షినాదిలో రానా మంచి స్నేహితుడని చెప్పుకొచ్చిన ఈ భామ…

తనకు అత్యంత సన్నిహితుడు అంటూ కొనియాడింది. తన కెరీర్ మొదటి నుంచి కూడా రానా తనకు మద్దతు ఇచ్చాడని చెప్పుకొచ్చిన ఆమె… మంచు లక్ష్మి, తాము ఒక గ్యాంగ్ అని మేమంతా తరుచుగా కలుస్తూ ఉంటామని చెప్పుకొచ్చింది. ఒకరికి ఒకరంటే గౌరవమని చెప్పిన ఈ భామ… తమ మధ్య చాలా మంది స్నేహితులు ఉన్నారని అలాంటిది ఏమీ మా మధ్య లేదని వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం రానా విరామంలో ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి అతను విరాట పర్వం అనే కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Share.