తెలుగు పరిశ్రమలో రాజమౌళిని దాటేసే దర్శకుడు ఎవరు లేరు.. ప్రస్తుతానికి ఇది మాట వాస్తవమే అని చెప్పొచ్చు. తెలుగు సినిమా స్థాయిని పెంచి.. తెలుగు పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన గ్రేట్ డైరక్టర్ రాజమౌళి. బాహుబలి చేసేముందు అది ఇలాంటి గొప్ప సంచలనం సృష్టిస్తుందని అతను ఊహించి ఉన్నాడో లేదో కాని బాహుబలి లాంటి సినిమా తీసినందుకు తెలుగు ప్రేక్షకులు అతనికి హ్యాట్సాఫ్ అనేశారు.
స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఆ సినిమా నుండి బాహుబలి వరకు ప్రతి సినిమా సూపర్ హిట్ కొడుతూనే వచ్చాడు. అయితే 15 ఏళ్ల కెరియర్ అయ్యాక కాని బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. కాని సాహో డైరక్టర్ సుజిత్ మాత్రం రన్ రానా రన్ అనే చిన్న సినిమా తీసి రెండేళ్లకే అతను పాన్ ఇండియా మూవీ చేశాడు. ఇది నిజంగా సుజిత్ కు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
24 ఏళ్లకే బాహుబలితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏప్రచుకున్న ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోవడం చూస్తుంటే సుజిత్ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని అతను అన్నివిధాలుగా వాడుకుని సినిమాను అంచనాలకు మించి తెరకెక్కించాడు. సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ డబుల్ అవడమో ట్రిపుల్ అవడమో జరగొచ్చు కాని సుజిత్ కూడా పాన్ ఇండియా డైరక్టర్ గా ప్రమోట్ అవడం ఖాయం.