రవితో పాటు బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. అయితే ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోలో చాలావరకూ మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ జరిగాయి. అందులో ఉదాహరణగా తాజాగా యాంకర్ రవి ని తీసుకోవచ్చు. అయితే కేవలం రవి ని మాత్రమే కాకుండా మునుపటి బిగ్ బాస్ సీజన్స్ లో షాకింగ్ ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. మరి ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళిన ఆ కంటెస్టెంట్ ఎవరు తెలుసుకుందాం..

బిగ్ బాస్ సీజన్ 1లో నటుడు ప్రిన్సి ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది. అప్పట్లో ప్రిన్సీ ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 2 లో యాంకర్ శ్యామల ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. అప్పట్లో శ్యామల ది ఎలిమినేషన్ అంటూ ఓట్లు వేసి మరొకసారి హౌస్ లో కి పంపించారు.

బిగ్ బాస్ సీజన్ 3 లో ఆలీ రేజా ఎవరు ఊహించని విధంగా మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ తో బయటికి వచ్చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 4 లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందర్ని కంటతడి పెట్టించింది.

బిగ్ బాస్ సీజన్ 5 లో యాంకర్ రవి ఎలిమినేషన్, ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా జరిగింది. ఈ విషయంపై రవి ఫ్యాన్స్ బిగ్ బాస్ నిర్వాహకులపై పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.

Share.