రజిని వర్సెస్ ధనుష్.. మామా అల్లుళ్ల ఫైట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజినికాంత్ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దర్బార్. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అసురన్ తర్వాత ధనుష్ చేస్తున్న సినిమా పటాస్.

దురై సింథిల్ కుమార్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగుతుంది. కోలీవుడ్ లో 2020 సంక్రాంతి సీజన్ లో మామా అళ్లుళ్ల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఫైట్ అటు తళైవా ఫ్యాన్స్.. ఇటు ధనుష్ ఫ్యాన్స్ మధ్య ఆసక్తి కలిగిస్తుంది. అసురన్ బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ మామతో మొదటిసారి బాక్సాఫీస్ ఫైట్ లో నిలుస్తున్నాడు.

ఇక మురుగదాస్ తో రజిని మొదటిసారి చేస్తున్న దర్బార్ సినిమాపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మరి రజిని వర్సెస్ ధనుష్ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Share.