యువ హీరో నితిన్ హాట్రిక్

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ హీరో నితిన్.. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా మూడు సినిమాలు పట్టాలెక్కించి హాట్రిక్ కొట్టాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నితిన్ తన అభిమానులకు పండుగే పండుగ చేయనున్నాడు. అసలే సినిమాలు లేక అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా ఏకకాలంలో మూడు సినిమాలకు ప్లాన్ చేసి వరుసగా తెరకెక్కిస్తూ అభిమానులకు కిక్ ఇచ్చాడు నితిన్.

ఇప్పటికే వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. నితిన్ కాల్షిట్స్ను మొత్తం భీష్మకే ఇచ్చాడనే ప్రచారం ఉంది. భీష్మ సినిమాలో తన ఫార్ట్ పూర్తి కాగానే వెంటనే రెండో సినిమాలో జాయిన్ అవుతారట. ఇటీవలే చంధ్రశేఖర్ యేలేటి ప్రాజెక్టు సినిమాకు కొబ్బరి కాయ కొట్టాడు హీరో నితిన్. రెండో సినిమాను లైన్లో పెట్టిన నితిన్ అది పూర్తి చేయగానే తన మూడో సినిమాను పట్టాలెక్కిస్తాడట.

అంటే నితిన్ వరుసగా ఎలాంటి మూడు సినిమాలు చేసి టాప్ హీరోలతో పోటి పడుతున్నాడటన్న మాట. సరే రెండు సినిమాలు పట్టాలెక్కించిన నితిన్ మూడో సినిమాకు అప్పుడే టైటిల్ను ఖరారు కూడా చేశారు. రంగ్దే అనే టైటిల్తో, గిమ్మి సం లవ్ అనే ట్యాగ్తో సినిమాను ప్రకటించాడు. నితిన్ సరసన కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. దర్శకుడు వెంకి అట్లూరి. కెమెరామెన్గా పిసి శ్రీరామ్ను ఎంపిక చేశారు. సితార సంస్థ నిర్మాణ సంస్థగా ముందుకు వచ్చింది. ఇంకా సంగీత దర్శకుడిని ప్రకటించలేదు. ఈ సినిమా సైలెంట్ లవ్ స్టోరీ అనే అనుమానం కలుగుతుంది. సో ఏదేమైనా నితిన్ మూడో సినిమా టైటిల్ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్టు చేసి తన అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.

Share.