మ‌నోజ్ డైవ‌ర్స్ వెన‌క అస‌లు క‌థ ఇదే…

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ వైవాహిక బంధం ముగిసింది. మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం ఒక ముఖ్యమైన మెసేజ్‌ను సాయంత్రం ఐదు గంటల లోపుగా మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పిన మనోజ్ సాయంత్రం విడాకుల విషయాన్ని ఒక పోస్టు ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

చాలా భారమైన హృదయంతో నాకు అధికారికంగా విడాకులు వచ్చాయనే విషయం నీకు తెలియజేస్తున్నాను…. ఒక అందమైన ఎన్నో గుర్తులు ఉన్న మా అనుబంధం ఎంత త్వరగా ముగుస్తుందని అనుకోలేదు అంటూ ఎమోషనల్ గా తన పోస్టులో రాసుకొచ్చాడు. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న మీదట ఇద్దరం ఎంతో బాధను అనుభవించామని.. చివరకు కలిసి ఉండలేమన్న‌ నిర్ణయానికి వచ్చి విడిపోతున్నాం అని… ఇద్దరం ఎప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటామ‌ని… మీరంతా మా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను అని మరో పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఇక మనోజ్ వదిన విష్ణు భార్య అయినా విరోనిక రెడ్డి స్నేహితురాలు అయిన ప్రణతి రెడ్డి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు మనోజ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన ఏడాది నుంచే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వేరుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యలో ఒకసారి ఈ దంపతులు విడాకులు తీసుకున్నార‌న్న‌ వార్తలపై మ‌నోజ్‌ స్పందిస్తూ తాము కలిసే ఉంటున్నామని క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఎట్టకేలకు వీరు విడిపోక తప్పలేదు.

సినిమా రంగంలో ఉన్న మనోజ్ ఎప్పుడు బిజీ బిజీగా ఉండటంతో ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ప్ర‌ణ‌తికి కావాల్సినంత టైం కేటాయించ‌క‌పోవ‌డం జ‌రుగుతూ వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యంలో ఏర్ప‌డిన చిన్న చిన్న విబేధాలే చివ‌ర‌కు వీరు విడిపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ట‌. ఇక వీరిని క‌లిపేందుకు మంచు కుటుంబం చేసిన ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో వీరు విడాకులు తీసుకోక త‌ప్ప‌లేదు.

Share.