మొగుడు కావాలంటున్న హీరోయిన్..

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ లో నటించి మెప్పించిన అదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. అందం అభినయం ఉన్నా సరే అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. అందుకే ఏవో చిన్న చితకా సినిమాలు తప్ప సరైన ఛాన్సులు రాలేదు. అయినా సరే నిరాశపడకుండా తన ప్రయతనాలు తను చేస్తుంది అదా శర్మ. ఇక ఖాళీగా ఉండటం దేనికి సరదాగా ఫోటో సూట్స్ చేస్తే పోలా అనుకుంటూ అమ్మడు రెచ్చగొట్టే అందాలతో ఆడియెన్స్ ను అలరిస్తుంది.

తన ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ ఇచ్చే అదా శర్మ తన వీడియోలతో మెసేజ్ కూడా ఇస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడికి పెళ్లి గాలి తగిలినట్టు ఉంది. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి అంటే అంటూ ఓ పెద్ద లిస్ట్ చెప్పింది అదా శర్మ. కాబోయే భర్త తనకు మూడు పూటలా నవ్వుతూ వండి పెట్టాలని.. సిగరెట్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండకూడదని.. రోజు క్లీన్ షేవ్ తో ఉండాలని అలాంటి వాడు ఏ కులమైన ఏ మతమైనా పర్లేదని అంటుంది.

అన్ని ఓకే కాని తాగొద్దు తినొద్దు లాంటి కండీషన్స్ పెట్టడం వల్ల ముందు అలాంటివి లేకపోయినా తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అదా శర్మ పెట్టిన ఈ మెసేజ్ కు క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. తన ఫ్యాన్స్ లోనే చాలామంది నీకోసం అన్ని మానేస్తా వంట రాకున్నా నేర్చుకుంటా అంటూ మెసేజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. మొత్తానికి అదా శర్మ సోషల్ మీడియాలో బాగా ఆరితేరిందని చెప్పొచ్చు.

Share.