ప్రస్తుతం సినిమాలకు ఒకరకంగా సంక్రాంతి సీజన్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. అయితే సంక్రాంతి సీజన్ కంటే ముందుగానే నందమూరి బాలకృష్ణ తన రూలర్ సినిమాను విడుదల చేస్తున్నారు. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతి సమయంలో వేరే సినిమాలు ఉండటంతో బాలకృష్ణ తన సినిమాను ముందుగానే అభిమానుల ముందుకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ముఖ్యంగా 60 ఏళ్ళ వయసులో బాలకృష్ణ లుక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 20 న ఈ సినిమా విడుదల అవుతుంది. అలాగే మెగా హీరో సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ప్రతి రోజు పండుగే అనే సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా 20 నే విడుదల అవుతుంది. ఈ నేపధ్యంలో సిని అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరం తేజ్, బాలయ్య ను తట్టుకుంటాడా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
సాధారణంగా బాలకృష్ణ కు ఫాలోయింగ్ ఎక్కువ. సినిమా ఎలా ఉన్నా సరే ఆయన నటన కోసం చాలా మంది హాల్ కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మెగా హీరోకి అభిమానులు తక్కువ… ఒక పక్క బాలయ్య సినిమా విడుదల కావడంతో ఆయన సినిమా గురించి అసలు చర్చలు కూడా జరగడం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు. బాలకృష్ణ సినిమా గురించే చర్చలు అన్నీ… ఇక మెగా అభిమానులు అయితే… ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద దృష్టి పెట్టారు. మరి ఈ పరిస్తితితుల్లో ఈ యువ మెగా హీరో బాలకృష్ణ ను ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి.