ఏ సినీ పరిశ్రమలో అయినా ‘ఎఫైర్స్’ అనేవి కామన్ గా ఉంటాయి. ఈ ఎఫైర్స్ ఎక్కువ హీరో-హీరోయిన్ల మధ్య ఎక్కువ నడుస్తాయి. ఇక తెలుగు చిత్రసీమలో కూడా ఇలాంటివాటికి కొదువ ఏం లేదు. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక జంట ఎఫైర్ గురించి పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. తెలుగుచిత్రసీమలో అగ్రహీరోకు మేనల్లుడుగా ఉన్న ఓ హీరో ఫామ్ లో ఉన్న ఓ హీరోయిన్ మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే గతంలో మంచి మంచి విజయాలు సాధించిన అగ్రనటుడు మేనల్లుడు..ఇప్పుడు వరుసగా ఫ్లాపులు ఇస్తున్నాడు. ఇక ఇటీవల ఓ సినిమాతో మోస్తరు విజయం దక్కించుకున్న ఆ హీరో..తాజాగా మరో చిత్రంలో నటించాడు. ఈ చిత్రం క్రిస్టమస్ కు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో నటించిన హీరోయిన్ తో ఆ హీరో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ హీరోయిన్ కూడా హీరో వలలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి వీరు పరిచయం మరింత పెరిగి…ఇప్పుడు సీక్రెట్ గా కలుసుకొనే స్థాయికి వెళ్ళినట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కూడా ఎక్కడ చూసిన వీరే కనబడుతున్నారు. సినిమాకు చెందిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉందో కూడా అర్ధమైపోతుంది. అసలు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లు అయిపోయారని తెలుస్తోంది. వీరి మధ్య ఓ రేంజ్‌లోనే సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అన్నది ఇండస్ట్రీ హాట్ టాపిక్. మొత్తానికైతే ఈ ప్రేమ జంట డీప్ లవ్ లో ఉన్నట్లు కనబడుతోంది. ఇక ఆ మేనళ్లుడు హీరో గతంలో ఓ హీరోయిన్‌తో వరుస సినిమాలు చేసి ఆమెతోనూ ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.