మెగా ఫ్యామిలీ కి చుక్కెదురు..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద హీరో అయినా.. పరభాషలో మాత్రం జీరోలుగానే మిగులుతున్నారు. మెగాస్టార్ నుంచి నేటి సాధారణ హీరోల వరకు ఎవరు ఇంతవరకు పరభాష లో తమ సత్తాను చాటుకోలేక పోతున్నారు. అదే పరభాష చిత్రాల హీరోలు మాత్రం తెలుగులో భాగానే తమ మార్కెట్ను పెంచుకుంటున్నారు. మరి ఎందుకు టాలీవుడ్ హీరోలు పరభాషలో తమ మార్కెట్ను పెంచుకోలేకపోతున్నారు.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఎంతో స్టామినా ఉన్న హీరో. అయితే పరభాషలో మాత్రం తన సత్తాను చాటలేకపోతున్నాడు. తెలుగులో నటించిన ప్రతి సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. కానీ ఎందుకో ఆయన నటించిన చిత్రాలు మాత్రం పరభాషలో మాత్రం తమ సత్తాను చాటలేకపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్లో నటించిన చిత్రాలు ఆజ్కా గుండారాజ్, ప్రతిబంద్ సినిమాలు కూడా పెద్దగా ఆడిన దాఖాలాలు లేవు.

అదే కోవలోకి మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటించిన చిత్రాలు బాలీవుడ్లో సత్తా చాటలేక పోయాయి. రామ్ చరణ్ బాలీవుడ్లో కొంత మేరకు రాణించినా అవి అనుకున్నంత రేంజ్లో మాత్రం సక్సెస్ సాధించలేదనే చెప్పవచ్చు. పరభాష చిత్రాల్లో కేవలం ఎంతో కొంత మార్కెట్ సంపాదించుకుందంటే అది అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. అల్లు అర్జున్ కేరళలో మాత్రమే తన ఫాలోయింగ్ పెంచుకోగా, ప్రభాస్ బాలీవుడ్లో బాహుబలి పుణ్యమా అని మార్కెట్ను పెంచుకున్నాడు. ఏదేమైనా టాలీవుడ్లో మెగాస్టార్ అయినా పరభాషలో మాత్రం సాధారణ హీరోలుగానే మిగిలిపోతున్నారు.

Share.