ముద్దు సీన్స్ చాలా కామన్.. వాటికి నేనెప్పుడైనా రెడీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మూతి ముద్దుల హంగామా ఇప్పుడు సౌత్ లో చాలా కామన్ అయ్యింది. ఏదైనా సినిమా వచ్చింది అంటే అందులో లిప్ లాక్ సీన్స్ లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో లిప్ లాక్ సీన్స్ రచ్చ కొనసాగుతూనే ఉంది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ చేయగా అందులో తెలుగు సినిమాలో కన్నా ఎక్కువ మూతి ముద్దులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన బైత సంధు లిప్ లాక్స్ చాలా కామన్ అని.. రెగ్యులర్ సీన్స్ చేసినట్టుగానే తాను ఆ సీన్స్ చేస్తా అని అంటుంది బనిత సంధు. ప్రేక్షకులు వాటిని ప్రత్యేకంగా చేస్తారు కాని నాకైతే ఆ సీన్స్ ప్రత్యేకంగా ఏమి అనిపించదు అని అంటుంది అమ్మడు. తెలుగుతో పోలిస్తే తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. తమిళ అర్జున్ రెడ్డి సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు అతనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని తెలుస్తుంది. ముందు బాలా డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అదంతా స్క్రాప్ లో వేసి కొత్తగా ఈ సినిమా చేశారు. అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరక్టర్ గిరీశయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

Share.