టాలీవుడ్‌లో ఈ వీకెండ్ రాబోతున్న రెండు సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పేరుకు అవి చిన్న సినిమాలే అయినప్పటికీ… జానర్, కంటెంట్, స్టార్ కాస్ట్, స్పెషల్ ఎట్రాక్షన్స్ కారణంగా ఆ రెండూ వేటికవే విభిన్నంగా నిలిచాయి. అవి ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశాయి. ఈ రెండు సినిమాల్లో మీకు మాత్రమే చెప్తా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విజయ్ దేవరకొండ. అవును.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మెయిన్ స్ట్రీమ్ నిర్మాతగా మారాడు. విజయ్ ఈ సినిమాకు నిర్మాత కావడమే స్పెషల్ ఎట్రాక్షన్. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారడం. ఈ సినిమాపై అందరూ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణాలు ఈ రెండే.
ఇక విజయ్‌కు పెళ్లిచూపులు లాంటి సూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు హీరోగా పెట్టి విజయ్ నిర్మాతగా మారి సినిమా చేయడం… ఇక ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరగడం.. శాటిలైట్ రైట్స్‌కు సైతం మా టీవీ రు.2 కోట్లు ఆఫర్ చేయడం ఈ సినిమాకు మంచి హైప్ ఇచ్చాయి.
వీటికి తోడు ట్రయిలర్ కూడా బాగుండడంతో కూసింత అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే సినిమా తెలంగాణ యాసలో కూడిన డైలాగ్స్, కామెడీ, ఎమోషన్‌తో ఉంటుందని…. ఖచ్చితంగా ఇదో వైవిధ్యమైన సినిమా అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. మరి మీకు మాత్రమే చెప్తా ఏం చేస్తుందో? చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.