టాలీవుడ్ లో జయం సినిమాతో హీరోగి పరిచయం అయిన నితిన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. కెరీర్ ఆరంభించి ఇప్పటికీ పదిహేనేళ్లు దాటినా ఈ కుర్ర హీరో టాప్ హీరోల లిస్ట్ లో మాత్రం చేరలేకపోయాడు. అలా అని ఏ ఒక్క సినిమా హిట్స్ లేవని కెరీర్ ఆపలేదు. జయం తర్వాత ఆ స్థాయిలో గుండె జారి గల్లంతయ్యిందే,ఇష్క్,అ..ఆ సినిమాలో మంచి సక్సెస్ అందుకున్న నితిన్ గత కొంత కాలంగా మంచి హిట్ కోసం కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు.
తాజాగా ప్రస్తుతం నితిన్ ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే చిత్రంలో కూడా నితిన్ నటించనున్నాడు. ఇక భీష్మ అన్ని ఏర్పాటు చేసుకొని డిసెంబర్ క్రిస్మస్ కి రిలీజ్ చేయబోతున్నారట.
ఇదిలా ఉంటే..వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీలో ఓ యంగ్ బ్యూటీని దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మిస్ తెలంగాణ అవార్డు గెలుచుకున్న యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సిమ్రాన్ చౌదరి విషయానికి వస్తే..మంచి హైట్ పర్సనాలిటినే కాదు ఇట్టే ఆకర్షించే ముఖ వచ్ఛస్సు కూడా కలిగి ఉంది. మిస్ తెలంగాణ అవార్డు గెలుచుకున్న యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.