మరోసారి విలన్గా మరీనా స్టార్ హీరో..

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను పాపులర్ సినిమాల్లో హీరోగా నటించాడు. తాను నటించిన సినిమాలు యూత్లో మంచి క్రేజ్ను సంపాదించిపెట్టాయి. అయితే హీరో పాత్రలతో పాటుగా విలన్ పాత్రల్లో కూడా తాను నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు ఈ యువ హీరో. ఇప్పటికే టాలీవుడ్లో హీరో రానా దగ్గుబాటి విలక్షణమైన పాత్రలతో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు. రానా పాత్ర ఏదన్నది కాకుండా ఆ పాత్రకు వచ్చే ఇమేజ్ను.. పాత్రకు జరిగే న్యాయాన్ని బేరీజు వేసుకుని నాయకుని పాత్రనైనా, ప్రతినాయకుని పాత్రనైనా పోషిస్తాడు.

ఇప్పుడు అదే దారిలో ఈ హీరో కూడా పయనిస్తున్నాడు. హీరో ప్రేమ్లోనే ఇరుక్కోకుండా.. తాను విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ హీరో మరోసారి విలన్గా మారబోతున్నాడు ఇప్పటికే ఓ సినిమాలో విలన్గా చేసిన ఈ హీరో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి విలన్గా తన విశ్వరూపం చూపబోతున్నాడు. ఇంతకు విలన్గా నటించబోతున్న హీరో ఎవ్వరో అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి..

ఆర్ ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయిన హీరో కార్తికేయ. ఇప్పుడు 90ఎంఎల్ అంటూ థియోటర్లలో ఇరగదీస్తున్నాడు. అయితే ఈ హీరో ఇప్పుడు ఓ ప్రముఖ హీరోకు విలన్గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తికేయ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో విలన్గా నటించబోతున్నాడు. కార్తికేయ ఇప్పటికే నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్గా నటించి మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఇప్పుడు అజిత్ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు అంటే ఆ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సో అటు హీరోగా.. ఇటు విలన్గా ఏకకాలంలో రెండు పాత్రలతో అలరించబోతున్నాడు కార్తికేయ.

Share.