టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ నుంచి రెండో వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ముందుగా విష్ణు ఆ తర్వాత మనోజ్ హీరోలు అయ్యారు. ఇక మనోజ్ తాజాగా తన భార్య ప్రణతిరెడ్డికి విడాకులు ఇచ్చినట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. గురువారం ఉదయమే తాను ఈ రోజు ఓ ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చెప్పగా సాయంత్రానికి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తూ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న ప్రకటించాడు.
బిట్స్ ఫిలానీలో ఇంజనీరింగ్ చదివిన ప్రణతిని మనోజ్ 2015లో పెళ్లి చేసుకోగా… నాలుగేళ్లకే వీరు విడిపోయారు ఇక వాస్తవంగా చూస్తే రెండేళ్ల క్రితం నుంచే వీరు దూరంగా ఉంటున్నారు. ప్రణతి సైతం అమెరికాలోనూ ఉంటూ ఇండియాకు కూడా రావడం లేదని తెలుస్తోంది. భార్య దూరం కావడంతో మనోజ్ కూడా కెరీర్ పరంగా సరిగా కాన్‌సంట్రేషన్ చేయడం లేదు.
అందుకే ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ ఏ సినిమా చేయలేదు. ఇదిలా ఉంటే మనోజ్ – ప్రణతి దంపతులకు విడాకులు ఎప్పుడో వచ్చాయంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెందిన వారు ఎవ్వూ ధృవీకరించ లేదు. అందుకే వీరి విడాకులపై టాలీవుడ్‌లో వార్తలు ఎప్పటి నుంచో గుప్పుమంటున్నాయి. ఇక ఎట్టకేలకు నిన్న మనోజ్ క్లారిటీ ఇవ్వడంతో విడాకుల విషయం బహిర్గతమైంది. ఇక మనోజ్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలని అతడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.