మంచు మనోజ్ డెశిషన్ తో షాక్ అవుతున్న హీరోలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ ఈమధ్యనే తన భార్యతో విడిపోతున్న విషయాన్ని వెళ్లడించాడు. అంతేకాదు ఇక మీదట సినిమాల మీదనే పూర్తి దృష్టి పెడతానని కూడా ప్రకటించాడు. అయితే అలా అన్నాడో లేదో మంచు మనోజ్ కొత్త ఆఫీస్ తెరిచేశాడు. మంచు మనోజ్ ఇక నుండి హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడని అంటున్నారు.

ఇప్పటికే మంచు మోహన్ బాబు లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మంచు లక్ష్మి కూడా సొంత బ్యానర్ పెట్టింది. ఇప్పుడు మనోజ్ కూడా సొంత బ్యానర్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. కేవలం తన ప్రొడక్షన్ లో తనే కాదు బయట హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు మంచు మనోజ్.

మనోజ్ కు తెలుగులో ఉన్న అందరి స్టార్స్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ పరిచయంతోనే అతను అడిగితే మాత్రం చేయనని చెప్పరు. అందుకే మనోజ్ ఈ కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్స్ అంతా సొంత బ్యానర్ లు స్టార్ట్ చేశారు. వారితో పాటుగా మంచు మనోజ్ కూడా సత్తా చాటేలా ఉన్నాడు. కొన్నాళ్లుగా ఫ్యామిలీ ప్రాబ్లంస్ తో వెనుకపడ్డ మనోజ్ ఇక మీదట దూసుకెళ్తాడేమో చూడాలి.

Share.