మెగాబ్రదర్ కొణిదల నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగబాబు సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ, అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలలో హీరోగా తనదైన శైలిలో అలరించిన నాగబాబు, బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు మొదటిగా ఎక్కువ ప్రిఫరెన్స్ తన కుటుంబానికి తన కుటుంబానికి ఇస్తాడు అన్న విషయం తెలిసిందే. నేడు ఆయన భార్య పద్మజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్య పద్మ తో కలసి దిగిన సోషల్ మీడియాలో పంచుకున్నారు నాగబాబు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం నువ్వు లేకపోయి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమని ఉండేది. ఎల్లప్పుడు నాతో ఉంటూ నీ ప్రేమతో నా ముందుచూపుతో అసాధ్యాలను కూడా ససాధ్యాలు చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే డియర్ పద్మ అని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లికి వరుణ్ తేజ్, అలాగే నిహారిక సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో పద్మజ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.