సౌత్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అమ్మడి అందం అభినయం చూసి దర్శక నిర్మాతలు వరుస ఛాన్సులు ఇచ్చారు. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన కాజల్ సీనియర్ స్టార్స్ లో చిరుతో కూడా జత కట్టింది. కెరియర్ ముగిసిందని అనుకునే టైంలో క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటూ వస్తున్న కాజల్ ఓ బిజినెస్ మ్యాన్ తో డీప్ లవ్ లో ఉందని లేటెస్ట్ టాక్.
కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాజల్, బిజినెస్ మ్యాన్ లవ్ ఎక్కడికో వెళ్లిందట. అతనితోనే కాజల్ పెళ్లంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేసి కాజల్ ఇక పెళ్లికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమా పూర్తయ్యాక తన పెళ్లి గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇస్తుందట కాజల్ అగర్వాల్.
తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే బిజినెస్ మెన్ తో లవ్ పెళ్లి విషయాలను ఇప్పటికి సీక్రెట్ గానే ఉంచుతుంది కాజల్. అయితే పెళ్లి తర్వాత కాజల్ సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా సమంత వరుస సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల పంథా మార్చి ఫీమేల్ లీడ్ సినిమాలకు సమంత ఓటు వేస్తుంది. మరి కాజల్ కూడా అలానే చేస్తుందా లేక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందా అన్నది చూడాలి.