బిగ్ బాస్ లో లవ్.. పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ కాని ఇక్కడే ట్విస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ సిప్లిజంగ్, పునర్నవిలు ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తున్నారు. పునర్నవి మీద ప్రేమ ఉందని రాహుల్ అందరిముందు ఒప్పుకున్నాడు. అయితే హౌజ్ లో పునర్నవి కూడా రాహుల్ తో క్లోజ్ గా ఉన్నా బయటకు వచ్చాక మాట మార్చేసింది. ఇక బిగ్ బాస్ విజేతగా రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నాడు. పునర్నవి ఆల్రెడీ ఒకరితో రిలేషన్ లో ఉందని తను కేవలం మంచి స్నేహితురాలే అంటున్నాడు రాహుల్.

ఇదిలాఉంటే రాహుల్ తల్లి మాత్రం తన అబ్బాయి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాహుల్, పునర్నవి ఒకరినొకరు ఇష్టపడితే వారి పెళ్లికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని అన్నారు. మరి రాహులేమో పునర్నవికి వేరొకరితో లవ్ అంటుంటే రాహుల్ తల్లి మాత్రం వారి పెళ్లికి తామందరం ఓకే చెబుతున్నాం అంటుంది.

ఇంతకీ పునర్నవి, రాహుల్ ల మధ్య ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. సింగర్ గా సూపర్ ఫాం లో ఉన్న రాహుల్ హీరోయిన్ గా పెద్దగా క్లిక్ అవని పునర్నవి ఇద్దరి ప్రేమ పెళ్లిదాకా వెళ్తుందా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది చూడాలి.

Share.