బాహుబలి సెంటిమెంటేనా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమా.. సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఓ అద్భుతమైన ఓ మెలిమి బంగారం. బాహుబలి సృష్టించిన సునామిని తట్టుకుని నిలబడిన సినిమాలు తక్కువే… బాలీవుడ్, టాలీవుడ్ ఏ ఉడ్ అయినా బాహుబలి రికార్డులు సునామిలో కొట్టుకుపోయాయి. ఇంకా బాహుబలి సినిమా రికార్డులను తిరగరాయగలమా అనే సందిగ్థంలోనే అందురు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇప్పుడు అదే బాహుబలి సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు దర్శకుడు…

ప్రతి సినిమా వాళ్లకు సెంటిమెంట్ అంటే తెగ పిచ్చి… ప్రతి సినిమాకు ఓ సెంటిమెంట్తోనే ముందుకు పోతుంటారు సినిమా వాళ్ళు. అయితే ఇప్పుడు బాహుబలి సెంటిమెంట్ను పాటిస్తున్నాడు బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. దర్శకధీరుడిగా కీర్తినందుకుంటున్న రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపకల్పనలో బిజిగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్లో మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్లు నటిస్తున్నారు.

అయితే రాజమౌళి ఫాలో అవుతున్న బాహుబలి సెంటిమెంట్ ఏమై ఉంటుంది.. బాహుబలి సినిమాలోని కొన్ని సీన్లను బల్గేరియాలో చిత్రీకరించాడట రాజమౌళి. బాహుబలి మొదటి పార్ట్లో మంచు పర్వతాల నేపథ్యంలో వచ్చే సీన్లను అక్కడ ఒక లొకేషన్లో చిత్రీకరించాడట. అయితే ఇప్పుడు అదే ప్రదేశంలో ఆర్ ఆర్ ఆర్ కోసం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాడట రాజమౌళి. ఇప్పటికే అదే లొకేషన్లో అందమైన ప్రదేశాలను చూసి చిత్రికరణకు సిద్దం చేసుకున్నాడట. ఇంతకు ఇది వర్కట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే…

Share.