బాల‌య్యతో సినిమా కోసం నిర్మాత‌ల్లో పోటీ ఎందుకు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆరు పదుల వయసు వచ్చినా సరే కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు నందమూరి అందగాడు బాలకృష్ణ. ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. హిట్లు ఫ్లాపులు, విమర్శలు, వసూళ్లు ఇవేమీ పట్టించుకోకుండా గ్యాప్ లేకుండా నటిస్తున్నాడు ఈ నందమూరి నట సింహం. దీనితో దర్శకులు కూడా బాలకృష్ణ తో సినిమా అనగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనతో సినిమా కోసం ప్రత్యేకంగా ఆయనకు తగిన విధంగా కథలు రాసుకుని బాలయ్య వద్దకు వెళ్తున్నారు.

వరుసగా సినిమాలు చేయడం, డేట్లు కూడా ఇబ్బంది లేకుండా కేటాయించడం, పారితోషకం విషయంలో ఇంతే కావాలని డిమాండ్ చేయకపోవడం కూడా దర్శకులకు కలిసి వస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ఇదే నిర్మాతలకు కూడా వరంగా మారిందని అంటున్నారు. బాలకృష్ణతో సినిమా చేయడానికి లో బడ్జెట్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఆయనతో సినిమా కోసం రోజుల తరబడి ఎదురు చూసే అవకాశం లేకపోవడం, పారితోషకం కూడా డిమాండ్ చేయకపోవడం, హీరోయిన్ల విషయంలో కొత్త వారిని తీసుకొచ్చినా,

పెద్దగా అభ్యంతరం తెలపకపోవడం, విదేశాల్లో షూటింగ్ అంటే కండీషన్లు, డిమాండ్లు లేకపోవడం, సినిమా బడ్జెట్ తక్కువలో అయిపోవడం, అభిమానుల్లో క్రేజ్ ఉండటం, సినిమా త్వరగా పూర్తి చేసేయడం వంటివి చిన్న నిర్మాతలను ఆకట్టుకుంది. దర్శకుడు చెప్పినా విధంగా నటించడంతో పాటు కథలో మార్పులు చెయ్యాలి అని చెప్పకపోవడం కూడా నిర్మాతలను ఆయనతో సినిమా చేసే విధంగా చేస్తుంది. యువ హీరోలు కూడా షో చేస్తున్న ఈ రోజుల్లో అంత స్టార్ ఇమేజ్ ఉండి కూడా బాలకృష్ణ సినిమాల విషయంలో నిర్మాతలకు తగినట్టు ఉండటం వారిని ఆకట్టుకుంటుంది.

Share.