మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ లో మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినా..తర్వాత హిట్ టాక్ వినిపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 108కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సైరా దాదాపు 85కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్… ఓవర్సీస్‌లో రూ. 28 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్న సైరా దక్షిణాదిలో రూ. 32 కోట్లు, ఉత్తరాదిలో రూ. 35 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
నిన్న సైరా రిలీజ్ రోజునే బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్ ’ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు అంతా. ఈ విషయంలో చాలా మంది పోల్స్ కూడా పెట్టారు.వాటిలో కూడా వార్ సినిమాకే కాస్త ఎడ్జ్ దక్కింది. అయితే నిన్న సాయంత్రం వరకు సైరా క్రియేట్ చేసిన సెన్సేషన్ ముందు వార్ నిలబడలేక పోయింది.
ఈ మూవీలో యాక్షన్ తప్ప మరే ఎలిమెంట్స్ లేకపోవడం నిరాశపరిచిందని అంటున్నారు. నిన్నటి సాయంత్రం వరకు బాలీవుడ్ క్రిటిక్స్‌కి సైతం సైరా సంగతి ఏంటి అనేది అర్ధమైపోయింది. సినిమా గ్రాండియర్ లాంటి అంశాలు పక్కనబెడితే మెగాస్టార్ అభినయం, సినిమాలోని పేట్రియాటిజంకి అంతా ఫిదా అయిపోయారు. దాంతో తెల్లారేసరికి అక్కడ మొత్తం సైరా జపం చెయ్యడం స్టార్ట్ అయ్యింది. ఈ వార్‌లో సైరా భాష అనే బారియర్‌ని కూడా దాటి ఉత్తరాది వాళ్ళ మనసులు కూడా గెలుచుకుని అసలు సిసలు విజయం దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఒకటే మాట జయహో సైరా అంటున్నారు…మొత్తాని చిరు సైరాతో బాలీవుడ్ లో మీసం మెలేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్.