100 సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ తన వేగం పెంచాడని చెప్పొచ్చు. యువ హీరోలతో సమానంగా బాలకృష్ణ సినిమాలు చేయడం విశేషం. ప్రస్తుతం రూలర్ గా రాబోతున్న బాలకృష్ణ రీసెంట్ గా బోయపాటి శ్రీను సినిమాకు ముహూర్తం పెట్టాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
అయితే సినిమాలో మరో స్పెషల్ రోల్ ఉందట. ఆ పాత్ర కోసం జబర్దస్త్ యాంకర్ రశ్మిని తీసుకునే చాన్సులు ఉన్నాయట. యాంకర్ గా.. హీరోయిన్ గా రశ్మికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటుంది. బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం రశ్మికి లాక్ తగిలినట్టే. అయితే సినిమాలో రశ్మికి బాలయ్యతో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
చూస్తుంటే బోయపాటి బాలయ్య సినిమాలో రశ్మికి మంచి రోల్ దక్కిందని తెలుస్తుంది. రశ్మితో బాలయ్య స్టెప్పులేస్తే నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. కనబడదు కాని బాలయ్య కూడా డ్యాన్సులు ఇరగదీస్తాడు. మరి అలాంటి బాలయ్య స్పీడుకి రశ్మి తట్టుకుంటుందో లేదో చూడాలి.