నందమూరి బాలకృష్ణ 106వ సినిమా కోసం వెయిట్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలయ్య 106వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈరోజు శుక్రవారం ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు కె.ఎస్ రామారావు డైరక్షన్ లో రూలర్ సినిమా చేశారు.
ఆ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఒక సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం బాలకృష్ణకు అలవాటే. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులు రిలీజ్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన బాలయ్య బాబు రూలర్ తర్వాత బోయపాటి శ్రీను మూవీ షురూ చేశాడు. సిం హా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బోయపాటి రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ కూడా భారీ అంచనాలతో వచ్చింది కాని ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అంచనాలను అందుకోలేదు. అయితే బాలయ్యతో ఆల్రెడీ రెండు హిట్లు ఉన్నాయి కాబట్టి బోయపాటి శ్రీను కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని అంటున్నారు.