సాధారణంగా.. నందమూరి హీరోలకు తెలుగు మీద పట్టు ఎక్కువ… ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వాళ్ళు అందుకున్నదే అది. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ఇలా ప్రతీ ఒక్కరు కూడా తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడతారు. తెలుగు మాట్లాడితే అందులో ఇంగ్లీష్ ని కలిపే ప్రయత్నం చేయరు… ఇక్కడ వాళ్ళను పొగడటం అని కాదు గాని ఇతర భాషల హీరోలకు మాత్రం అది చాలా వరకు తక్కువ… ఎక్కడో ఒకరిద్దరు మినహా తెలుగుని స్పష్టంగా చాలా తక్కువగా మాట్లాడతారు.
అది పక్కన పెట్టి బాలకృష్ణ గురించి మాట్లాడితే మాత్రం… ఆయన తెలుగు మాట్లాడే విధానానికి చాలా మంది భాషా ప్రేమికులు ఆశ్చర్యపోతూ ఉంటారు… సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నా సరే ఆయన తెలుగులో పద్యాలు చెప్పడం, సామెతలు చెప్పడం, ఇక సినిమా యూనిట్ ని పొగిడే సమయంలో… పాటలను బాణీలు అని వ్యాఖ్యానించడం, దర్శక నిర్మాతలను… పొగిడే సమయంలో కూడా పూర్తిగా తెలుగు భాషలోనే మాట్లాడటం, గత విషయాలను గుర్తు చేస్తూ తెలుగు పద్యాలను ప్రస్తావించడం,
అంతే కాకుండా… తెలుగు భాష గొప్పదనాన్ని చెప్పడం వంటివి చాలా వరకు ఆయన ప్రసంగంలో చూడొచ్చు… ఎవరు ఎన్ని అన్నా సరే బాలకృష్ణ స్థాయిలో తెలుగు మాట్లాడే నటుడు సిని పరిశ్రమలో లేరు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆయన్ను ఎవరైనా సరే వ్యక్తిగతంగా విమర్శించడమే గాని అయన తెలుగుని ఎద్దేవా చేసే వారు గాని ఆయనకు భాష మీద ఉన్న పట్టుని విమర్శించే వాళ్ళు గాని లేరు… ఆయన ప్రసంగం ఎక్కువ సేపు ఉండి అభిమానులను విసిగించవచ్చు ఏమో గాని… ఆ ప్రసంగం మాత్రం సరిగా వింటే అందంగా ఉంటుంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.