ఈ రోజుల్లో స్టార్ హీరో సినిమా అనగానే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా ప్రకటన వచ్చిన దగ్గరి నుంచి మధ్యలో హీరోయిన్ చీర గురించి చిన్న వార్త బయటకు వచ్చినా పెద్ద చర్చలు దానికి పెద్ద ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాల మీద అంచనాలు కూడా తారా స్థాయిలో ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ మార్కెట్ ఈ మార్కెట్ అంటూ సినిమా విడుదలకు ముందే భారీగా మార్కెట్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. ఇప్పుడు హీరోలు కూడా ఆ మార్కెట్ లో షేర్ అడగడం మొదలుపెట్టారు.
ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలకు వసూళ్లు కూడా భారీగానే ఉంటున్నాయి… ఈ సినిమాలకు అభిమానుల అంచనాలు ఉండటంతో ఇతర ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెరుగుతుంది. దీనితో వసూళ్లు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ బయ్యర్లకు ఒక చిక్కు వచ్చి పడింది. సినిమా అంచనాలు చూసి వారు భారీగా కొనుగోలు చేయడానికి సిద్దపడుతున్నారు. స్టార్ హీరోలు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతుంది.
ప్రభాస్ సాహో సినిమాను భారీ ధరలకు కొనుగోలు చేసారు బయ్యర్లు.. ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇక చిరంజీవి సైరా సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని భావించినా ఫ్లాప్ అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ మాత్రం… బయ్యర్లు కలవడానికి వెళ్ళినా సరే అందుబాటులో లేకుండా పోయారు. అప్పటికే ఆయనకు రావాల్సిన లాభం మొత్తం వచ్చేసింది… అయినా సరే బయ్యర్లను కనీసం ఆదుకోలేదు. పవన్ సినిమాల విషయంలో కూడా గతంలో ఇదే జరిగింది. ప్రభాస్ సాహో సినిమా విషయంలో కూడా ఇదే జరగడంతో కొందరు బయ్యర్లు అప్పుల పాలైపోయారు.