ప‌వ‌న్‌తో సినిమా అంటేనే ఆ నిర్మాత‌లు భ‌య ప‌డుతున్నారా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలి అంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారా ? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ వ‌ర్గాల్లో వినపడుతుంది. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే.. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు అనేది అందరికి తెలిసిందే. దాదాపు పాతిక సినిమాలు తీస్తే 8 నుంచి 10 సినిమాలకు మాత్రమే బాగా స‌క్సెస్ అయ్యాయి.

ఎప్పుడో 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది త‌ర్వాత ప‌వ‌న్‌కు హిట్ లేదు. ఇక ఈ సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్దమయ్యారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమాలు చెయ్యాలి అంటే నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు భయపడిపోతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఫెయిల్ అవ్వ‌డంతో ఇప్పుడు మళ్ళీ సినిమాలు అంటున్నారు. ఆ మూడు సినిమాలు కొనుగోలు చేసిన బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. నిర్మాతలకు లాభాలు వచ్చాయి గాని వసూళ్లు రాక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితో నిర్మాతల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. పవన్ తో సినిమా అంటే ఎంత లేదు అనుకున్నా 80 నుంచి 100 కోట్ల వరకు అవుతుంది కాబట్టి… సినిమా ఫ్లాప్ అయితే వాళ్ల అప్పులు తీరే మార్గాలు క‌న‌ప‌డ‌డం లేదు.

అందుకే కొంద‌రు నిర్మాత‌లు ప‌వ‌న్‌తో సినిమా మాకొద్దు అని… ఆ కష్టాలు మాకు తెలుసు అని అంటున్నారట. ఇక గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కూడా తప్పుకున్నారు. ఆయన ఎప్పుడైనా సినిమాలు మానేసే అవకాశం ఉందని కాబట్టి పవన్ తో సినిమాల విషయంలో ఎంత దూరం పాటిస్తే అంత మంచిది అనే భావనలో ఉన్నారట.

Share.